ఎస్టేట్‌లోకి ప్రవేశించేపుడు సెక్యూరీటీ గార్డులు అడ్డుకోగా కనకరాజ్ వారితో సంప్రదింపులు జరిపి లక్షల రూపాయలు ఇస్తాని ఆశపెట్టినట్లు చెప్పారు. అయితే వారు నిరాకరించడంతో దుడ్డుకర్రలతో తలపై మోదగా స్పృహతప్పిపోయారని తెలిపారు. స్పృహరాగానే ఒక సెక్యూరిటీ గార్డు పారిపోగా, మరో గార్డు ఓం బహదూరును కత్తితో నరికి చంపివేసినట్లు తెలిపారు. ఎస్టేట్ భవంతితోని జయలలిత, శశికళ బెడ్‌రూంలలోకి ప్రవేశించి అక్కడి ర్యాక్, సూట్‌కేసుల్లో కట్టలు కట్టలుగా నగదు, మరో మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు ఉండగా, వాటిని కనకరాజ్ తీసుకుని అందరం కలిసి తెల్లారేలోగా తప్పించుకున్నట్లు వారు తెలిపారు.