రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

ఠాగూర్

సోమవారం, 6 జనవరి 2025 (09:14 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఢిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గ అభ్యర్థి రమేశ్ బిధూడీ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా కాంగ్రెస్ మహిళ ప్రియాంకా గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని రహదారులను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా తీర్చి దిద్దుతాం అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
ఈ వ్యాఖ్యలపై అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి, మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఎక్క్ వేదికగా మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, బిధూడీ వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ శ్రేణులను ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఇదిలావుంటే తన వ్యాఖ్యలపై రమేశ్ బిధూడీ ఎక్క్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు