రామమందిర నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేయలేం: యూపీలో బీజేపీ

బుధవారం, 25 జనవరి 2017 (15:59 IST)
యూపీలో విజయం కోసం బీజేపీ రామమందిర నిర్మాణం మాటెత్తింది. ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని లేవనెత్తింది.

యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ రామమందిర నిర్మాణాన్ని రెండు నెలల్లో నిర్మించలేమని.. ఎన్నికలు పూర్తయ్యాక రామమందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని యూపీ బీజేపీ చీఫ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తెలిపారు. 
 
రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశమని పేర్కొన్న మౌర్య, యూపీ సీఎం అఖిలేశ్‌ ఇటు దళితులను, అటు వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల జాబితాలో 17 ఓబీసీ కులాలను చేర్చేందుకు అఖిలేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో మౌర్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా యూపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రామమందిర నిర్మాణంపై గొంతెత్తారు. 

వెబ్దునియా పై చదవండి