తనకు వయసు మీదపడిందని, అందువల్ల తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు.
గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. అదేసమయంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటున్నట్టు అనేక సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. దీంతో ఆమె సీఎం పదవి నుంచి తప్పించాలని కోరినట్టు తెలుస్తోంది.