మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:04 IST)
మంత్రి పదవిని ఆశించి బిర్యానీ పార్టీ ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు బిర్యానీ విందు పార్టీ ఇచ్చారు. ఆమె పేరు పరమేశ్వరి. ఈమె మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందును ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా 25 మేకపోతులు, 250 కోళ్లను బలి యిచ్చి మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు సహా సుమారు 3 వేల మందికి బిర్యానీ విందునిచ్చారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు, అన్నాడీఎంకే పాలన వందరోజులు ముగిసినందుకుగాను ఈ విందును ఏర్పాటు చేశానని పరమేశ్వరీపైకి చెబుతున్నప్పటికీ, తనకు మంత్రి పదవి రావాలని అమ్మవారిని కోరుతూ ఈ విందు ఇచ్చారని పార్టీ స్థానిక శాఖ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకే మహిళా శాసనసభ్యురాలు ఒకేసారి 3 వేలమందికి బిర్యానీ విందును ఏర్పాటు చేయడం తారాపురంలో సంచలనం కలిగించింది. 

వెబ్దునియా పై చదవండి