'శతమానం భవతి' హిట్ కావడంతో అనుపమకి మెగా హీరో రాంచరణ్ - సుకుమార్ కాంబోలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. దాంతో ఇక అనుపమ టాప్ హీరోయిన్ అయిపోతుందని భావించారు. కానీ, చివరి నిమిషంలో అనుపమని తప్పించి సమంతని ఫిక్స్ చేయడంతో ఈ బ్యూటీకి ఊహించని షాక్.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోదామనుకున్న అనుపమకి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు ఛాన్స్ కూడా లేదు. చెర్రీ సినిమా కోసం అనుపమ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, అందుకే ఆమెని తప్పించారని అప్పట్లో రూమర్ వచ్చినప్పటికీ చివరు దర్శకుడు సుకుమార్ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు. మొత్తంమీద అనుపమ పరమేశ్వరన్ ఇపుడు ఇంటికే పరిమితమైపోయారు.