వివరాల్లోకి వెళితే.. మృతురాలు రీనాదేవి (39) చండీమందిర్‌లో గల ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి మార్కెట్లోని పిజ్జా షాపుకు కుమారుడితో వెళ్లారు. కారుతో పాటు ఆమె అదృశ్యమయ్యారు. కానీ గురువారం అర్థరాత్రి చండీమందిర్ - రామ్‌గఢ్ రోడ్డులోని భందెర్ ఘాట్ వద్ద తన కారులోనే ఆమె హత్యకు గురై రక్తపు మడుగులో కనిపించారు.
రీనాదేవి భర్త సందీప్ కుమార్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన ఓ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీనాదేవి ఉద్యోగరీత్యా ఇద్దరు కుమారులతో కలిసి చండీమందిర్‌లోని ఓ ఫ్లాటులో ఉంటున్నారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో సందీప్ కుమార్ కలుసుకుంటారు. అయితే ఈ వారంతం రీనాను కలవకముందే ఆమె హత్యకు గురైంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే అందిన పోస్టు మార్టం రిపోర్టులో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. రీనాపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. అయితే 15 ఏళ్ల రీనా కుమారుడు తన తల్లి మార్కెట్ నుంచి అదృశ్యమైనా ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసుపై విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.