ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని విద్రోహ శక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందనీ... అయినా తాను భయపడే ప్రసక్తే లేదని ఇటీవల మోడీ గోవాలో జరిగిన ఓ ర్యాలీలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వార్తలను నిజం చేస్తూ.. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి.
ఈ మేరకు మోడీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఇది కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకారం... పొలీసులు దీనిపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. మోడీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. ఇది కేవలం బూటకపు ఫోన్‌కాల్ మాత్రమేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం ప్రధానికి ప్రమాదం తీసుకొచ్చే ఏ చిన్నపాటి అవకాశాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతకు సంబంధించిన అంశంపై పోలీసులు మరింత సీరియస్‌గా దృష్టిపెట్టారు. మోడీ చంపేందుకు కుట్రజరగుతోందంటూ... దినేష్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఫోన్ నుంచి బుధవారం రాత్రి 11:30కి పోలీసులకు కాల్ వచ్చింది. దినేష్ బురారీకి చెందినవాడయినప్పటికీ... ఫోన్ మాత్రం దిల్షాద్ కాలనీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. కాల్ లొకేషన్‌కు వెళ్లి విచారించగా.. సదరు షాప్‌లో ఎవరూ కనిపించలేదు. దీంతో దినేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.