ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. నల్లదొరలకు మరో వెసులుబాటు కల్పించడం వంటి ప్రతిపాదనలపై కేబినెట్‌లో భిన్నాభిప్రాయాలు వెల్లడైనట్లు తెలిసింది. సమావేశం రాత్రి 8 గంటలకు జరుగుతుందని అధికారిక సమాచారం వెలువడింది. అయితే, ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ 8.15 గంటలకు ఈ భేటీకి హాజరయ్యారు.