అనాథ బాలికలపై లైంగికలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:47 IST)
దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లోని కేంద్రీయ విద్యాలయకు చెందిన ఓ అనాథ బాలిక తనను ప్రిన్సిపాల్ కుమార్ ఠాకూర్ లైంగికంగా వేధించాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కామాంధుడైన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
 
ఆ తర్వాత తన పలుకుబడిని ఉపయోగించి ఆ ప్రిన్సిపాల్ ‌బెయిలుపై విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులే ఒక బాలికే కాదు ఎవరి అండలేని పలువురు అనాథ బాలికలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సారి ప్రిన్సిపాల్ బారిన పడిన పలువురు బాలికల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనాథ పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి