అక్కడ అతడి దుస్తులు విప్పించేసి కూర్చోబెట్టి దుడ్డు కర్రలతో బాదడం మొదలుపెట్టారు. తమ సెటిల్మెంట్ల జోలికి రానని అతడు వేడుకున్నా వాళ్లు వదిలిపెట్టలేదు. కాళ్లతో మట్టగిస్తూ కర్రలతో రక్తం వచ్చేట్లు కొట్టారు. మద్దెలచెర్వు సూరి హత్యానంతరం మధుసూధన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోయి అక్కడ ఓ పేకాట క్లబ్బును నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలోపనిగా భూదందాల్లోనూ తలదూర్చడంతో అతడిపై హెబెట్టు గ్యాంగ్ దాడి చేసింది.