ఈ వేసవి సీజన్‌లోనే అత్యంత ఉష్ణోగ్రత మంగళవారం నమోదైంది. దాదాపు 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో నిపుణలకే సందేహమొచ్చి పరికరాలను పరిశీలించారంటే దాని తీవ్రత ఎ స్థాయిలో అర్థమవుతుంది. పరికరాల్లో లోపం లేదని, నైరుతి నుంచి వస్తున్న వేడిగాలుల వల్లే ఉష్ణోగ్రతలు ఆ స్తాయికి పెరిగి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో సోమవారం రికార్డు స్థాయిలో 49.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పరికరాలలో లోపాలు ఏమైనా ఉన్నాయేమోనని నిపుణులు పరిశీలించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్నడూ ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీంతో ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలతోపాటు వేడి పెరగడానికి కారణమైన ఇతర అంశాలను కూడా నిపుణులు పరిశీలించారు. అయితే పరికరాలలో తప్పులేవీ లేవనీ, సోమవారం నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందని ఓ అధికారి తెలిపారు. నిపుణుల బృందం బుధవారం మరోసారి ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపనుంది.