బిర్యానీ అంటే ఎగబడని వారు చాలా తక్కువగా ఉంటారు. కేవలం 5 పైసలకే బిర్యానీ అంటే... ఇక మామూలుగా ఉండదు కదా. ఈ జమానాలో 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయని భావిస్తున్నారా? ఆ హోటల్ యాజమాన్యం కూడా అదే రకంగా అనుకొని, ఈ ఆఫర్ ప్రకటించింది.
హోటల్ యాజమాన్యం సరదాకు ప్రకటించిందో, ఎవరూ రారని అనుకున్నారో, కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో ఆ హోటల్ యాజమాన్యం దెబ్బకు షెటర్ వేసేసింది. అయినా... ప్రజలు అక్కడి నుంచి కదల్లేదు. అదీ విచిత్రం.