కావేరీ జల వివాదంపై మరోమారు విచారణ జరిగింది. దిగువకు నీటిని విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని ధర్మాసనం ఆదేశింది.