వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని చిట్లపాక్కంకు చెందిన ఆడిటర్ జయదేవన్ (45), ఆయన భార్య రమాదేవి, వీరి కుమార్తె దివ్యశ్రీలు సజీవదహనం అయ్యారని పోలీసులు వెల్లడించారు. జయదేవన్ సతీమణి రమాదేవి టీచర్‌గా పని చేస్తుండగా, దివ్యశ్రీకి ఇటీవలే వివాహం జరిగింది. దివ్యశ్రీ భర్త విదేశాలకు వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాబలిపురం సమీపంలోని ఓ స్థలం చూసేందుకు జయదేవన్ తన భార్య రమాదేవి, కుమార్తె దివ్యశ్రీతో కలిసి వెళ్లారు.