దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వైరస్ బాధితుల్లో బుధవారం ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది.
అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6603 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23,724గా నమోదైంది. వీరిలో ఇప్పటి వరకు 9448 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తమిళనాడులో బుధవారం ఒక్కరోజే 3756 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరింది. వీరిలో 1700మంది మృత్యువాతపడ్డారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీలో కొత్తగా 2033 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3213మంది మృతి చెందారు.