తమిళనాడు రాష్ట్రంలో మరో రైలుకు ప్రమాదం తప్పింది. కొల్లాం - చెన్నై ప్రాంతాల మధ్య నడిచే చెన్నై ఎక్స్ప్రెస్కు రైల్వే సిబ్బంది అప్రమత్తతో ఈ ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
షాలిమార్ - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి తేరుకోకముందే ఒడిశాలోనే ఒక గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఇపుడు రైల్వే సిబ్బంది అప్రమత్తతో కొల్లాం చెన్నై ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది.
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలెట్ గుణనిధి మొహంతి చివరిగా చెప్పిన మాటలు ఇపుడు కీలకంగా మారాయి. తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అపుడే లూప్ లైనులోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. కానీ, లూప్లైనులో గూడ్సు రైలు ఆగివుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. లోకో పైలెట్ మహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, ఆయన చివరి మాటలు ఇపుడు విచారణలో అత్యంత కీలకంగా మారాయి.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్సు రైలును ఢీకొట్టినట్టుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ, ఈ ఎక్స్ప్రెస్ రైలుకు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే లూప్ లైనులోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ కాలేదని లోకే పైలెట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో లోకో పైలెట్ వివరించారు.