భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సోదరి పేరు జాతీయ గ్రామీ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో ఉండటం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై జిల్లాస్థాయిలో విచారణ జరుగుతోంది. అయితే, లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు చేరడానికి కారణం ఆమె అత్త గులే ఆయేషానే అని ప్రాథమిక విచారణలో తేలింది.
గులే ఆయేషా... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోరా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె ముందుండి తన కుటుంబ సభ్యుల పేర్లను జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో చేర్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే జిల్లా స్థాయిలో విచారణ సాగుతోంది. లబ్దిదారుల జాబితా నుంచి షమీ సోదరి పేరును తొలగించి, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ నిధి గుప్తా వెల్లడించారు.
కాగా, గత 2021-24 వరకు జాతీయ ఉపాధి హామీ పథకంలో లబ్దిదారులుగా ఉన్న షమీ సోదరి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్లపై షమీ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేదు. అయితే, వీరే తమ పేర్లను నమోదు చేసుకున్నారా? లేదా ఇతరులే వారి పేర్లతో ఇలా మోసాకిపాల్పడ్డారా? అనేది తేలాల్సివుంది. అయితే, ప్రాథమిక విచారణలో మాత్రం గ్రామపెద్దగా ఉన్న షమీ సోదరి అత్తే ఈ పాడుపనికి పాల్పడినట్టు గుర్తించారు.