అచ్చం సినిమాలోలాగా బాలికపై జరిగిన రేప్, విక్రయ వ్యవహారంపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 366, 376, 328,506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు పంపించి నిందితులైన పప్పుయాదవ్, అఫ్రోజ్‌లను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే... చత్తీస్‌ఘడ్ కు చెందిన 15 ఏళ్ల ఓ బాలిక బంధువుల ఇంటికి వెళుతూ పొరపాటున ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ఢిల్లీ రైల్వే స్టేషనుకు చేరిన మైనర్ బాలికను నీళ్ల బాటిళ్లు విక్రయించే ఆర్మాన్ అనే యువకుడు సరాయి కాలేఖాన్ ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లి భార్య హసీనా సహకారంతోనే అత్యాచారం చేశాడు. ఆపై బాలికను పప్పు యాదవ్ అనే యువకుడికి రూ.70వేలకు విక్రయించగా అతడు పెళ్లి చేసుకుని వేధింపులు మొదలెట్టాడు.