అబ్బే...ఎన్నికల్లో పోటీ చేయను : ఖుష్బూ

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:31 IST)
కన్నియకుమారి ఎంపి వసంత్‌కుమార్‌ మరణంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, బిజెపి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే కన్నియకుమారి నుంచి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖష్బూ పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కన్నియకుమారి పార్లమెంట్‌ స్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. 

ఎన్నికలు జరిగే ప్రతిసారి తన గురించి ఇలాంటి కథనాలు రావడం సహజంగా మారిందన్నారు. ఎంపి వసంత్‌కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు