శోభనం కోసం విదేశాలకు వెళ్లిన నవ దంపతులు మృతి

సోమవారం, 12 జూన్ 2023 (08:17 IST)
స్వదేశంలో వివాహం చేసుకుని శోభనం (హనీమూన్) కోసం విదేశీ పర్యాటక ప్రాంతానికి వెళ్లిన నవ దంపతులు మృత్యువాతపడ్డారు. వీరి ప్రయాణించిన పడవ సముద్రంలో బోల్తా పడటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వధూవరుల ఇంట విషాదం నెలకొంది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన వైద్యురాలు విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఇటీవలే వివాహం జరిగింది. ఈ నూతన దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన బోటులో షికారుకు వెళ్లారు. 
 
అయితే, వారు ప్రయాణించిన పడవ ఉన్నట్టుండి ఒక్కసారిగా బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో నవ దంపతులు నీట మునిగి మృతి చెందారు. లోకేశ్వరన్ మృతదేహాన్ని వెంటనే వెలికితీయగా, విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు