వరకట్న మృతి కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, దోషి అయిన భర్తను జైలుకు పంపించిన కేసులో... వయసు మళ్లి పక్షవాతంతో బాధపడుతున్న ఓ తల్లిని చూసుకునే బాధ్యతలను కోర్టు ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, పితాంపురాకు చెందిన ఓ వ్యక్తికి 2013 ఫిబ్రవరిలో ఓ మహిళతో వివాహమైంది.
ఇది వీరిద్దరికీ రెండో పెళ్లి.. భర్త తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడంతో వైద్య ఖర్చుల కోసం పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని భార్యను వేధించాడు. పలుసార్లు తన పుట్టింటివారితో ఈ విషయం చెప్పి వాపోయినా వారు పట్టించుకోకపోవడంతో.. 2013 జూన్ 2న అత్తవారింట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న మృతిగా నమోదైన ఈ కేసులో నిందితుడైన భర్తకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది.