ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేసే పనిమనిషి (వంట మనిషి) పిండిలో మూత్రం కలిపి చపాతీలు చేస్తోంది. ఈ తంతు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ ఆ పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 32 యేళ్ళ రీనా అనే ఓ మహిళ స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలో నివసించే ఓ పారిశ్రామికవేత్త నితిన్ గుప్తా ఇంటిలో గత ఎనిమిదేళ్ల నుంచి వంట మనిషిగా పని చేస్తుంది. చపాతీల కోసం తయారు చేసే పిండిలో నీళ్లకు బదులు మూత్రం కలిపి పిండిని తయారు చేసి, ఆ పిండితో చపాతీలు చేసి వడ్డిస్తూ వచ్చింది. ఈ తంతు గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ వచ్చింది.