ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో గొడవ జరిగింది. ఈ గొడవ ఫలితంగా జరిగిన తంతు కేవలం 2 గంటల్లో ఈ పెళ్లి పెటాకులైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, హెమ్చాపర్ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి తంతు ముగిసిన తర్వాత గందరగోళం చెలరేగింది. కొత్త పెళ్లికుమార్తెను అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో స్వల్ప అనారోగ్యంతో వరుడు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో చాలాసేపు అక్కడ డ్రామా జరిగింది. కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లనని మొండికేసింది.
జరిగిన వివాహ వేడుకలో వరుడు స్పృహ తప్పిన నేపథ్యంలో పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. హెమ్చాపర్ నివాసి భుఆల్ నిషాద్ ఇంటికి హైదర్‌గంజ్ నుంచి వరునితోపాటు అతని బంధువులు వచ్చారు. వివాహ వేడుక పూర్తయ్యింది. ఇంతలో వరుడు స్పృహ తప్పి పడిపోయాడు.