వివరాలను చూస్తే... జైన్ ఆలయంలో 45 ఏళ్ల శాంతిసాగర్ అనే వ్యక్తి పూజారిగా వున్నాడు. తనవద్దకు వచ్చిన వారికి స్వాంతన కలిగిస్తానని విశ్వాసం కల్పిస్తుండేవాడు. ఆ క్రమంలో బాధితురాలి కుటుంబం మహావీర్ దిగంబర్ జైన్ మందిరానికి గత శనివారం నాడు వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన 19 ఏళ్ల యువతిపై అతడి కన్ను పడింది.
దీనితో తల్లిదండ్రులు, బాధితురాలి సోదరుడిని మందిరంలోనే వుండి మంత్రాలను పెద్దగా ప్రార్థించమని చెప్పి, మీ అమ్మాయితో ప్రత్యేక పూజ చేయిస్తానని లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు పొక్కితే అపాయం జరుగుతుందని ఆమెను భయపెట్టడంతో చెప్పేందుకు జంకిన యువతి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దానితో పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనితో సదరు పూజారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.