చంద్రయాన్-3 జైత్రయాత్ర.. భావోద్వేగంలో ఇస్రో శాస్త్రవేత్తలు

బుధవారం, 23 ఆగస్టు 2023 (19:28 IST)
Chandrayaan-3
"చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్ భావోద్వేగానికి గురైయ్యారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమవడంతో ఆయన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే చంద్రయాన్ 3 కోసం పని చేసిన శాస్త్రవేత్తల బృందం... మిషన్ సక్సెస్ కావడంతో హ్యాపీగా వున్నారని చెప్పారు. ఈ మిషన్‌కు డైరెక్టర్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంచాలా గర్వంగా ఉంది.
 
మిషన్ ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతిదీ ఖచ్చితంగా జరిగిందని వీరముత్తువేల్ తెలిపారు. చంద్రుడిపై మెల్లగా దిగిన నాలుగో దేశంగా ఇప్పుడు భారత్ నిలిచింది. అలాగే చంద్రుని దిగువ భాగానికి దగ్గరగా ఉన్న మొదటి దేశం భారతదేశం అని, దీనిని దక్షిణ ధ్రువం అని పిలుస్తారని వీరముత్తువేల్ అన్నారు. 
 
చంద్రయాన్-3 అనే వ్యోమనౌక బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై ల్యాండ్ అయింది. దీనిని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఈ వ్యోమనౌక సుమారు రెండు వారాల పాటు పని చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు