పున్నమి వెన్నెలను చూస్తే మనసంతా ఎటో వెళ్లిపోతుంది. అన్నీ మర్చిపోయి అలా వెన్నెల లోకంలో విహరించేస్తాం. చందమామ వెండివెలుగులకు అంత అద్భుతమైన శక్తి ఉంది. చంద్రుడి వెన్నెలను చూస్తుంటే పరవశించని మనసు ఉండదు. మామూలుగా పున్నమి నాటి వెన్నెల కంటే ఈ కార్తీక పౌర్ణమి సమ్ థింగ్ స్పెషల్. ఏంటో తెలుసా... సాధారణ చంద్రుడి కంటే 30 శాతం ప్రకాశవంతం. ఎప్పుడూ పున్నమి చంద్రుడి కన్నా 7 రెట్లు పెద్ది... 7 రెట్లు ప్రకాశవంతం.
ఇకపోతే చాలా అరుదుగా కన్పించే సూపర్ మూన్‌ను తిలకించేందుకు తిరుపతి సైన్స్ సెంటర్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తున్నందున సందర్శకులు తిలకించడానికి వీలుగా రెండు టెలిస్కోప్‌లను ఉంచారు. చంద్రుడిపై ఉన్న లోయలను, పర్వతాలను అత్యంత స్పష్టంగా చూడటానికి అవసరమైన క్రేటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు సైన్స్ సెంటర్ అధికారులు చెప్పారు. తిరుమలలో ప్రతి పౌర్ణమికి జరిగే శ్రీవారి గరుడ సేవ కార్తీక మాసం సందర్భంగా మరింత శోభాయమానంగా జరుగనుంది. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు తిరుమల వెంకన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.