అభినందన్ ప్యారాచూట్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది: ఆర్మీ

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:24 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు ఢిల్లీలో గురువారం మీడియా ముందు ప్రకటన చేశారు. కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుందని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా వున్నామని, అలాగే శాంతి చర్చలకు కట్టుబడి వున్నామని వారు ప్రకటించారు. 
 
సమాచారాన్ని వక్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. తాము రెండు పాక్ విమానాలను కూలిస్తే పైలట్లు సురక్షితంగా దిగారు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించాయి. 
 
భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ విమానాలు వచ్చాయని.. మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. అభినందన్ ప్యారాచూట్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది. అభినందన్‌ను అలా వారు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు