స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల 'అస్త్ర' క్షిపణిని భారత్ మరోసారి పరీక్షించనుంది. వైమానిక పోరాటంలో సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్‌లపై ఆధిపత్యం ప్రదర్శించే దిశగా రూపొందించిన 'అస్త్ర' మార్క్ 2 మిసైల్‌ను భారత్ పరీక్షించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్షిపణి 160 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.