జయలలిత వున్నప్పుడు మోహన్ రావు 'కింగ్'.... ఆమె బ్రతికి వుంటే ఐటీ దాడులు జరిగేవేనా?

గురువారం, 22 డిశెంబరు 2016 (14:29 IST)
మోహన్ రావుపై ఐటీ దాడులు జరగడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బ్రతికివున్నప్పుడు మోహన్ రావు 'కింగ్'లా ఉండేవారని అక్కడివారు చెపుతున్నారు. జయలలిత తర్వాత పవర్ పాయింట్ ఆయనదేనని చాలామంది చెప్పేవారు. అలాంటి పవర్ పాయింటుపైన బుధవారం వేకువ జామున 5 గంటలకు ఐటీ దాడులు మొదలై గురువారం ఉదయం 6 గంటల వరకూ జరిగాయంటే, ఎంతటి సీరియస్ తనిఖీలు జరిగాయో అర్థమవుతుంది.
 
ఈ తనిఖీల్లో రూ. 30 లక్షల నగదు, 5 కిలోల బంగారం, ఇంకా అనేకచోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారని నిరూపణ అయితే అది అన్నాడీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారుతుందనడంలో సందేహం లేదు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పక్కదారి పట్టాడని నిరూపణ అయితే అన్నాడీఎంకే పార్టీ ఆత్మరక్షణలో పడిపోవడం ఖాయం. ఆయన అధికారి కాబట్టి తమకు సంబంధం లేదని అన్నాడీఎంకె చెప్పుకోజాలదు. ఎందుకంటే జయలలిత ఏరికోరి ఆయనను సీఎస్‌గా నియమించారు. అసలు ఆమె బ్రతికి ఉంటే రామ్మోహన్ రావుపై ఐటీ దాడులు జరిగేవా అని ప్రశ్నలు కూడా వేస్తున్నాడు సగటు జీవి.

వెబ్దునియా పై చదవండి