కర్ణాటకలో ఆ ఆనవాయితీ.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

శనివారం, 13 మే 2023 (09:48 IST)
Karnataka election results
కర్ణాటకలో గత 28 ఏళ్లల్లో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కాంగ్రెస్‌కే స్వల్పంగా మొగ్గు వుంటుందని పలు ఎగ్జిట్‌పోల్స్ చెప్పడం, జేడీఎస్‌ది కీలకపాత్ర అవుతుందని అంచనా వేయడంతో పార్టీల నేతలు, ప్రజల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. 
 
ఎన్నికల్లో విజయంపై అటు భాజపా, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తామే కింగ్ మేకర్ అవుతామని జేడీఎస్ నేత మాజీ కుమార స్వామి అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎర్లీ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. 
 
కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 132 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ 77 స్థానాల్లో, జేడీఎస్ 15 స్థానాల్లో ముందంజలో వున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు