నోట్ల రద్దు ఎఫెక్టు : వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో రోడ్డున పడిన 11 వేల మంది సెక్స్ వర్కర్లు

శుక్రవారం, 18 నవంబరు 2016 (13:02 IST)
పెద్ద నోట్ల రద్దు సెక్స్ వర్కర్లకు కూడా కష్టాలు తెచ్చిపెట్టింది. తమ వద్దకు వచ్చే కస్టమర్ల వద్ద పాత రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే ఉంటున్నాయి. అలాంటి వారికి పడక సుఖం అందించి.. పాత నోట్లు తీసుకునేందుకు అనేక మంది సెక్స్ వర్కర్లు అంగీకరించడం లేదు. దీంతో వారంతా ఉపాధిని కోల్పోతున్నారు. 
 
ప్రధానంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోన సోనాగచి, ఢిల్లీ, ముంబై ఏరియాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ ఏరియాలో సుమారు 11 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరంతా రోజువారీగా తమ వద్దకు వచ్చే విటులు ఇచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే, నోట్ల రద్దుతో తమ వద్దకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా, వచ్చిన వారు పాత నోట్లను ఇస్తున్నారు. 
 
దీంతో వారంతా ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నట్టు వాపోతున్నారు. ఈ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు చాలాసేపు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఫలితంగా మా బిజినెస్ తీవ్రంగా దెబ్బ తింటోంది అని ఈ అంగడి బొమ్మలు విలపించినంత పని చేస్తున్నారు. అయితే తమ బాసులు (నిర్వాహకులు) పాత నోట్లనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, తమ వద్దకు వచ్చే విటుల సంఖ్య తగ్గిపోయిందని వీళ్ళు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి