పాల బుడ్డీ నోట్లో పెడితే కేకలు.. బీరు బాటిల్ పట్టిస్తే నవ్వులు... Baby Funny Video

శుక్రవారం, 10 మార్చి 2017 (12:47 IST)
సాధారణంగా చిన్నారులు పాల బుడ్డీ కోసం ఏడుస్తుంటారు. లేదా, చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని మారాం చేయడం సాధారణం. కానీ, ఈ చిన్నారి మాత్రం బీరు బాటిల్ కోసం కిందపడి మరీ ఏడుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిండా రెండేళ్లు కూడా నిండ‌ని ఆ పాప‌కు త‌న తండ్రి ఏం ఇచ్చినా తీసుకోవ‌డం లేదు. త‌న నోటి ద‌గ్గ‌ర బీరు సీసా పెడితే మాత్రం తాగేస్తోంది. బాటిల్‌లోని బీరుని పాలలా తాగేస్తోంది. ఈ పాప‌కు అంటుకున్న ఈ అల‌వాటు ప‌ట్ల నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ చిన్నారికి బీరును అలవాటు చేసిన తండ్రికి చీవాట్లు పెడుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి