అబ్బో... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దు చేసిన దగ్గర్నుంచి నల్ల డబ్బు ఉన్న వ్యక్తులు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిమితి రూ.2.5 లక్షల విధించడంతో వాటిని పలు దారుల్లో డిపాజిట్లు చేయాలని ప్లాన్లు వేసుకుంటున్నారు. అక్కడక్కడ నల్ల డబ్బును తీసుకుని పల్లెటూళ్లకు వెళ్లిపోయి అక్కడ గ్రామస్తులతో సభలు పెట్టుకుని తేలిగ్గా వారి ఖాతాల్లోకి ఈ డబ్బును జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్లో నల్లడబ్బును ఏం చేద్దామంటూ ఓ అపార్టుమెంట్లో చార్టెడ్ అకౌంటుతో కలిసి మంతనాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 1.72 కోట్లు(రూ.1000 నోట్లు), రూ. 15.5 లక్షలు(రూ.500 నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని ఆదాయపు పన్ను అధికారులకు చేరవేశారు.