ప్రముఖ ఛానల్‌లో సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా అమాల్ విష్ణుదాస్ పని చేస్తున్నారు. ఈయన తన కింద పని చేసే ఓ మహిళ జర్నలిస్టును పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత జర్నలిస్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
ఈ ఫిర్యాదులో మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే ఆమెకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే విడాకులు మంజూరైన తర్వాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కెరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించడమే కాకుండా, తన తండ్రి వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు న్యూస్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. ఆయనను బుధవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్ తెలిపారు.