దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఓ మైనర్ బాలికపై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది.