దేశంలో నోట్ల రద్దు మంచిది కాదని తాను అనడం లేదని, అయితో నోట్ల రద్దు నిర్ణయంలోనే లోపం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ నిర్ణయ వల్ల నల్లధనానికి అడ్డుకట్ట వేయబోవద్దని తాను చెప్పడం లేదని, నోట్ల రద్దు మంచిది కాదని కూడా అననని, ఇదేసమయంలో ప్రజాగ్రహం ఏ పార్టీకీ లాభించదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడితే పాలకులు వృథాయేనని అన్నారు. ప్రభుత్వం నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని, ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తామని ఆయన సభా ముఖంగా హామీ ఇచ్చారు.
పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... దేశంలో పెద్ద నోట్ల రద్దు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటిత నేరమన్నారు. ఎందరో ప్రభుత్వ పెద్దలు ఈ నేరం వెనుక కుట్ర చేశారని ఆరోపించారు. కేవలం నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టవచ్చని మోడీ చేస్తున్న ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. నోట్ల రద్దుకు ముందు ఎంతమాత్రమూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, పూర్తి అనాలోచితంగా వేసిన అడుగులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
సామాన్యులు నిత్యమూ పనులు మానుకుని ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల కొద్దీ నిలబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణం వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తర్వాత వివిధ క్యూలైన్లలో వేచి చూస్తూ, 65 మంది వరకూ మరణించారన్న వార్తలు తనను కలచి వేసిందన్నారు. బ్యాంకుల వద్ద కనీస ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఉగ్రవాదం, చొరబాట్లు సైతం పెద్ద నోట్ల రద్దు వల్ల జరుగుతుందని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.
నోట్ల రద్దు వ్యవస్థీకృతమైన దోపిడీ జరుగుతోందని, ఇది చట్టపరంగా చేసిన భారీ తప్పిదమన్నారు. నోట్ల రద్దు కారణంగా జీడీపీ రెండుశాతం తగ్గిందని, ఈ విషయంలో ఆర్బీఐని తప్పుబట్టడంలో సరైనదే అని వ్యాఖ్యానించారు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వలేని దేశం ఏదైనా ఉందా? ఆయన మోడీ సర్కారును నిలదీశారు. నోట్ల రద్దుతో కరెన్సీ, బ్యాంకుల వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. ప్రధాని 50 రోజులు ఆగమంటున్నారు. కానీ పేదలకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పడం లేదని విమర్శించారు. నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహకారం అందించే కోఆపరేటివ్ బ్యాంకులు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.