మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ యువతిపై అత్యాచారం జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని సబర్బన్ విల్లే పార్లే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి ఫిజియో థెరపిస్ట్‌గా పనిచేసేది.
ఈమెపై ముంబయిలోని నగల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న దేబషీష్ ధర్ అనే 27 ఏళ్ల యువకుడు డిసెంబరు 6వ తేదీన యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై దారుణంగా హతమార్చి పరారైనాడు. నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించారు. ఆపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఐపీసీ 452, 376,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు.