అక్రమ ధనానికి, అవినీతిని అంతమొందించడానికి అడుగు కూడా వెనక్కి వేసేది లేదు. చాలామంది బాధతో లేఖలు రాశారు. రైతుల కష్టాలను తొలగిస్తాను. అవినీతి వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన అవసరం మాకుంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
పేదలు, మధ్యతరగతివారు తీసుకునే గృహ రుణాలపై వడ్డీలో రాయితీ ఇస్తాం. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఖర్చు పెరిగిపోతోంది. దీనిపై చర్చ జరగాలి. భీమ్ యాప్‌ను పరిచయం చేశాం. దీని ద్వారా నగదు లావాదేవీలు శులభతరం అవుతాయి" అని చెప్పారు.