16 వరకు ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్త నిరసనలు

గురువారం, 10 అక్టోబరు 2019 (11:23 IST)
దేశంలో ఆసాధారణ ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నారు. 
 
రాష్ట్రంలోనూ ప్రధాన కేంద్రాల్లో గురువారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలను చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తెలిపారు. నెల్లూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఈ ఆందోళనల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 
 
ఈ నెల 13న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇదే నెల 16న వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16 వరకూ వారం రోజుల పాటు వామపక్షాలు చేపట్టనున్న ఆందోళనలకు ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి జయప్రదం చేయాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ సమావేశాల్లో సిపిఎం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు