చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నాడా తుఫాను క్రమంగా బలహీనపడి కడలూర్ వద్ద శుక్రవారం తీరాన్ని దాటుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఐతే తీరం దాటిన తర్వాత మూడు లేదా నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నేవీ హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.