కర్నాటక రాష్ట్రంలో ఓలా, ఉబెర్, ర్యాపిడ్ సేవలు నిలిచిపోయాయి. ఈ మూడు సంస్థలకు చెందిన ఆటో రిక్షా సర్వీసులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో బుధవారం నుంచి ఈ ఆటో రిక్షా సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సంస్థలకు చెందిన ఆన్లైన్ బుకింగ్స్‌ను సైతం నిషేధిస్తున్నట్టు పేర్కొంది.
మరోవైపు, కర్ణాటక ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ ఆగ్రిగేటర్స్ రూల్(కొట్టార్-2016) చట్టం ప్రకారం క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించేందుకు అవకాశం లేదని రవాణా కమిషనర్ తెలిపారు. ఆటో రిక్షా సేవలు నిలిపివేసేలా సైబర్ డివిజన్‌కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.