సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరపున 10 మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం.
కాగా, పాకిస్థాన్ దేశ బహిష్కరణకు గురైన భారత దౌత్యాధికారి సూర్జీత్ సింగ్ తమ దేశంలో ఉండడానికి వీలులేని వ్యక్తిగా పాక్ ప్రకటించింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాక్ విడిచారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 27న ఆయనను 48 గంటల్లోగా పాకిస్థాన్ విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించిన విషయం తెల్సిందే.