సెల్వంకు శశికళ చీమ కుట్టినా ప్రధాని మోదీ షాకిస్తారు... ప్లగ్ రెడీగా ఉన్నదట...

సోమవారం, 26 డిశెంబరు 2016 (15:25 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారానికి మరో నాలుగేళ్లూ ఢోకా లేదని అంటున్నారు. పెద్దమ్మ జయలలిత పోయాక చెన్నైలో చిన్నమ్మ శశికళ పోస్టర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకె పార్టీని నడిపించే శక్తి చిన్నమ్మకే ఉన్నదని కొనియాడుతున్న పార్టీ సీనియర్లు, అమ్మ జయలలిత ఏలిన కుర్చీ కూడా కట్టబెడదామని ప్రయత్నించిన్నట్లు సమాచారం. మొన్నామధ్య పన్నీర్ సెల్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. 
 
అంతకుముందు రోజు రాత్రి అన్నాడీఎంకే పార్టీ సభ్యులందరూ తమిళనాడు ముఖ్యమంత్రి పోస్టును చిన్నమ్మకే కట్టబెట్టాలంటూ తీర్మానం చేశారట. ఈ తీర్మానానికి పన్నీర్ సెల్వం కూడా తలూపినట్లు సమాచారం. ఐతే ఆ మరుసటి రోజు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పనులతోపాటు రాజకీయ సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారట. దీనితో శశికళకు షాకిచ్చే నిర్ణయాలను ప్రధానమంత్రి మోదీ తీసుకున్నట్లు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు ఇంటిపై ఐటీ దాలు చేశారనీ, ఇంకా ఎక్కువ చేస్తే తదుపరి నేరుగా శశికళనే టార్గెట్ చేస్తారనే వానలు వినిపిస్తున్నాయి. కాబట్టి పన్నీర్ సెల్వం అధికారంలో వుండగా ఆయనకు ఎలాంటి ఢోకా ఉండదని అనుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి