గూఢచర్యం కేసులో సమాజ్‌వాదీ ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి అరెస్టు

ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:14 IST)
గూఢచర్య కేసులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వ్యక్తిగత కార్యదర్శిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు ఎంపీల వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఫర్హాత్ అనే వ్యక్తి 18 ఏళ్లుగా పాకిస్థాన్‌ గూఢచారులకు సమాచారం ఇస్తూ సహకరిస్తున్నట్లు బయటపడింది. దీంతో ఆయనను కటకటాల వెనక్కి నెట్టారు. 
 
రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర రహస్య పత్రాలు స్వీకరిస్తూ అక్టోబరు 26న అరెస్టయిన పాక్‌ రాయబార కార్యాలయ ఉద్యోగి మహమూద్‌ వద్ద జరిపిన విచారణలో ఫర్హాత్ బండారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు చౌదరి మునాబర్‌ సలీం దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న ఫర్హాత్ తన ఏజెంట్‌లలో ఒకరని వెల్లడించాడు. 
 
అఖ్తర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఎంపీ ఇంట్లో ఉన్న ఫర్హాత్‌తోపాటు జోధ్‌పూర్‌కు చెందిన వీసాల బ్రోకర్‌ షోయబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. 

వెబ్దునియా పై చదవండి