తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు తల్లికంటే ఎక్కువ ప్రేమగా చూసుకోవాల్సిన ఓ కేర్ టేకర్.. ఆ పసి పిల్లల పట్ల సైతాన్‌గా మారింది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఓ పసిపాను కాళ్ళతో తన్నుతూ ఎత్తి కింది విసిరేస్తూ... గొడ్డును బాదినట్టు బాదింది. ఆడుకుంటున్న పిల్లను లాగిలాగి కొట్టింది. ఆ సైతాన్ కొట్టిన దెబ్బలు తాళలేక ఆ పసిబడ్డి గుక్కపెట్టి ఏడుస్తున్నా ఏమాత్రం జాలి లేకుండా నేలకేసి కొట్టింది. అదీ కూడా తనకు అలుపు వచ్చేంత వరకు కొడుతూనే ఉంది.
నవీ ముంబైలోని పూర్వా ప్లేస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫూటేజీలు నమోదైన ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుని పోతుంది. దీంతో పాప తల్లి ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్వా ప్లే స్కూల్ సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే పాపను కేర్ టేకర్ అఫ్సానాషేక్ కొడుతూ కనిపించింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి 14రోజుల రిమాండ్‌కు పంపించారు.