అమ్మకు రెండు కాళ్లు పనిచేయలేదా? మెర్సీ కిల్లింగ్ కోరుకున్నారా? శశీ నన్ను చంపేయ్ అన్నారా?

గురువారం, 22 డిశెంబరు 2016 (13:00 IST)
అపోలోలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన దివంగత సీఎం జయలలితపై మలేషియా పత్రిక ఆసక్తికర కథనం ప్రచురించింది. తనను మెర్సీ కిల్లింగ్ చేయమని స్వయంగా జయలలిత నెచ్చెలి శశికళను కోరినట్లు ఆ పత్రిక ఊటంకించింది. డయాబెటిస్ కారణంగా జయలలిత కాళ్లు రెండూ పనిచేయలేకుండా పోయాయని, దీంతో మనస్తాపానికి గురైన జయలలిత.. కాళ్లు లేకుండా జీవించలేనని.. తనను చంపేయాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు ఆ పత్రిక తెలిపింది. 
 
గత సెప్టెంబర్ 22వ తేదీ తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యం కారణంగా చెన్నై అపోలోలో చేరి.. డిసెంబర్ 6న అర్థరాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో జయలలిత మరణంలో సస్పెన్స్ ఉందని అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం పట్ల పలు అనుమానాలున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకా అమ్మ మరణంపై మిస్టరీ వీడాలని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే జయలలిత కాళ్లు పనిచేయలేకుండా పోయాయని.. అందుకే శశికళతో తనను చంపేయాలని జయలలిత కోరుకున్నట్లు మలేషియా పత్రిక తెలిపింది. 17-12-16న ప్రచురితమైన పత్రికలో అమ్మ కాళ్లు లేక జీవించలేనని, మెర్సీ కిల్లింగ్‌ చేయమని శశికళను వేడుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వెబ్దునియా పై చదవండి