ఎంత దారుణం...? పులిని ఉరి తీశారు... ప్లీజ్ #SaveTigers... ప్రకాష్ రాజ్

శుక్రవారం, 29 జులై 2016 (13:56 IST)
ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు చేసి సినీ అభిమానులను మెప్పించిన నటుడు ప్రకాష్‌ రాజ్‌. ఈ మధ్యకాలంలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న సెలబ్రిటీస్‌ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. అలాంటి స్టార్స్‌ లిస్టులో ప్రకాష్‌ రాజ్‌ కుడా చేరాడు. ప్రకాష్‌ రాజ్‌ కర్ణాటకలోని బందిపూర్‌ గ్రామంలో సంచరిస్తూ అక్కడి స్కూల్‌ పిల్లలకి, ఆ గ్రామ ప్రజలకి మన జాతీయ మృగం అయిన పులిని కాపాడుకోవడం మన బాధ్యతనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు.
 
ప్రకాష్‌ రాజ్‌ 'సేవ్‌ టైగర్‌' అనే కాన్సెప్ట్‌తో నేషనల్‌ లెవల్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ టైగర్‌ని సేవ్‌ చెయ్యడం ఎంత అవసరం అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కర్ణాటకలోని నాగర్‌హోల్‌ ఫారెస్ట్‌‌లో తిరుగుతూ అక్కడి ప్రజలకి టైగర్‌ ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు. అలా తిరుగుతున్నప్పుడు ఓ పులి చెట్టుకు వేలాడుతూ ఉరి తీయబడిన దృశ్యం కనబడింది. దీనిపై ఆయన తన ట్విట్టర్లో ఇలా రాసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి