ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఫారసుతో ఓ విద్యార్థిని చదువు కోసం రూ.1.50 లక్షల రుణాన్ని పొందారు. దీంతో ఆ విద్యార్థిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పైగా, దేశ అధినేత నుంచి ఈ తరహా సిఫారసు రావడంతో ఆ యువతి ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కర్నాటకలోని మాండ్యకు చెందిన ముస్లిం బాలిక బిబి సారా అనే విద్యార్థిని పై చదువులు చదువుకునేందుకు బ్యాంకుల్లో విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, తగిన దస్తావేజులు చూపలేదన్న సాగుతో బ్యాంకు అధికారులు ఆ యువతికి రుణం మంజూరు చేయలేదు. తీసుకున్న రుణం తీర్చగలదన్న నమ్మకం కుదరకపోవడంతోనే రుణం మంజూరు చేయలేదు.