రాష్ట్రపతి.. దేశాధిపతి. త్రివిధ దళాధిపతి. అలాంటి వ్యక్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కోసం పెను సాహసమే చేశారు. అదేంటో ఓసారి పరిశీలిద్ధాం. సోమవారం రాత్రి కన్నుమూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం మెరీనా తీరంలో జరిరగింది. ఈ అంత్యక్రియలకు ముందు జయలలిత పార్థివదేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. అక్కడకు వచ్చి జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పెద్ద సాహసమే చేశారు.
ఢిల్లీ నుంచి చెన్నైకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన లగ్జరీ ప్లేన్ బోయింగ్ 737లో చేరుకున్న ప్రణబ్.. అక్కడి నుంచి మెరీనా తీరానికి చేరుకునేందుకు ఎయిర్‌ఫోర్స్ వాళ్లు రవాణకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను ఎక్కాల్సి వచ్చింది. కాగా, ఈ హెలికాప్టర్‍లో బోయింగ్‌లాగా లగ్జరీ సీట్లు ఉండవు. దీంతో ప్రణబ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావడానికి మొదట ప్రణబ్ బయలుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బయలుదేరిన కొద్దిసేపటికే మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.
ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన కాసేపటి తర్వాత ప్రణబ్ మళ్లీ చెన్నై బయలుదేరారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. ఆయనను మెరీనా బీచ్‌కు తీసుకెళ్లడానికి ఎంఐ-17 హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి ప్రయాణించడానికి అంత అనువుగా లేకపోయినా.. ప్రణబ్ మాత్రం అప్పటికే ఆలస్యం కావడంతో అందులోనే మెరీనా తీరానికి చేరుకునేందుకు సాహసం చేశారు. దీంతో ఆయన జయలలిత అంత్యక్రియలకు ముందే హాజరయ్యారు. జయలలిత పార్థివదేహానికి నివాళుర్పించి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.